పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. అందులో హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. ఈ మధ్యే ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లబోతుంది. నిజానికి పవన్ తో హరీష్ మరో సినిమా అనుకున్నాడు. కానీ ఇప్పుడు ‘తేరి’ సినిమాను రీమేక్ చేస్తున్నాడు.
గతంలో గబ్బర్ సింగ్ అనే రీమేక్ సినిమాతో పవన్ -హరీష్ కాంబో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పవన్ చాలా సినిమాలు చేశాడు అందులో గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ కి స్పెషల్ మూవీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ కాంబో మూవీ మీద భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఏప్రిల్ 5 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని సమాచారం.
ప్రెజెంట్ పవన్ సముద్రఖని డైరెక్షన్ లో వినోదాయ సీతమ్ రీమేక్ సినిమా చేస్తున్నాడు. పవన్ నెలాఖరు వరకు ఈ సినిమాకి డేట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఉస్తాద్ కి షిఫ్ట్ అవుతాడు. హరీష్ శంకర్ సినిమాకు సంబందించి ఒకటి రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసి సుజీత్ తో ఓజీ ను స్టార్ట్ చేస్తాడు.
ఇవి కూడా చదవండి…