‘ఉస్తాద్ భగత్ సింగ్’..షెడ్యూల్ పూర్తి

34
- Advertisement -

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్ లో పవర్-ప్యాక్డ్ మాసీవ్ యాక్షనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రానున్న రోజుల్లో ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లతో వస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. వర్క్స్ జరుగుతున్న తీరుతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.

గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో పాటు సినిమా గ్లింప్స్ కి అన్నివైపుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ హ్యాజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది.ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ మళ్లీ పోలీసుగా అలరించబోతున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు.

అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేస్తుండగా, రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

Also Read:ఇదీ సచివాలయం అంటే..

- Advertisement -