హైదరాబాద్‌లో ఉస్తాద్ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్

34
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ ఎవెయిటింగ్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హైదరాబాద్ లో నాన్ స్టాప్ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ తో సాగుతోంది. మేకర్స్ రెండు వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేయడం ద్వారా డబుల్ ట్రీట్‌ ని అందించారు.

ఈ పోస్టర్లలో పవన్ కళ్యాణ్ ఖాకీ డ్రెస్ లో బ్లాక్ షేడ్స్ తో మ్యాచో గా కనిపిస్తున్నారు. ఒక పోస్టర్‌లో దర్శకుడు హరీష్ శంకర్‌తో సీరియస్‌గా మాట్లాడుతున్నట్లు కనిపిస్తుండగా, మరొక పిక్చర్ లో సెట్‌లో ఫెరోషియష్ గా నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపించారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

Also Read:బాబు పై పూనమ్ కౌర్ ఇలా, మురళీమోహన్ అలా!

అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎడిటింగ్ ఛోటా కె ప్రసాద్. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

- Advertisement -