పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ సినిమా జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది. ‘తేరి’ సినిమాను అటు ఇటుగా కాస్త మార్చి తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు హరీష్ శంకర్. మూడు , నాలుగేళ్ల నుండి ఈ రీమేక్ సినిమా చేయాలని చూస్తున్న మైత్రి ఫైనల్ గా పవన్ -హరీష్ కాంబోలో ఈ రీమేక్ సినిమాను నిర్మించనుంది.
ప్రస్తుతం కాస్టింగ్ ఫైనల్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు హరీష్. హీరోయిన్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. పూజ హెగ్డే డేట్స్ కుదరకపోవడంతో ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని తెలుస్తుంది. మరో హీరోయిన్ వేటలో ఉన్నారని టాక్. జనవరి నెలాఖరు నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్లాన్ రెడీ చేస్తున్నాడు హరీష్. ఈ లోపు హరి హర వీరమల్లు కొంత ఘాట్ ఫినిష్ చేసి ఉస్తాద్ భగత్ సింగ్ ఘాట్ లో జాయిన్ అవుతాడు పవన్. వచ్చే ఏడాది ఎండింగ్ లేదా 2024 సంక్రాంతి కి ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి…