పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఒక క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుందని హరీష్ శంకర్ ఆలోచిస్తున్నాడు. మరి, పవన్ కళ్యాణ్ శ్రీనిధికి క్రేజీ ఆఫర్ ఇస్తాడా ? లేదా ? అనేది చూడాలి. ప్రస్తుతానికి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. వారిలో ఒకరిగా శ్రీనిధి శెట్టి కాగా, మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంది. ఈ పాత్ర.. కథనే మలుపు తిప్పుతుంది. అందుకే, ఈ పాత్రలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ను తీసుకోనున్నారు.
ఇక హీరోయిన్స్ కంటే కూడా మరో కీలక పాత్ర ఈ సినిమాలో ఉందట. ఈ పాత్రలో అమితాబ్ బచ్చన్ ను ఒప్పించాలని హరీష్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ వార్త వాస్తవ రూపం దాల్చితే.. భారతీయ సినీ తెరకు మరో పండుగ ఖరారు అయినట్టే. మరి ఆ పండుగ త్వరగా రావాలని కోరుకుందాం. అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమా ఒప్పుకుంటాడని హరీష్ శంకర్ నమ్మకంగా ఉన్నాడు. కారణం ఈ కథ చాలా మలుపులు తిరుగుతుందట. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ – పవన్ కళ్యాణ్ మధ్య బలమైన ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయట. మరి ఇలాంటి బరువైన కథలో అమితాబ్ – పవన్ బలమైన నటులు నటిస్తే.. ఆ అపూర్వమైన నటనా సామర్ధ్యాలను చూడటానికి మన రెండు కళ్ళు చాలవు.
ఇవి కూడా చదవండి…