‘ఉస్తాద్ భగత్ సింగ్’..క్రేజీ షెడ్యూల్!

9
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానరర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.

ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్. రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్. స్క్రీన్ ప్లే కె. దశరథ్ రాశారు, అడిషినల్ రైటింగ్ సి చంద్ర మోహన్.

తాజాగా రీసెంట్ క్రేజీ షెడ్యూల్ ని మేకర్స్ కంప్లీట్ చేశారు. దీనిపై హరీష్ పోస్ట్ చేసిన పోస్ట్ అండ్ పిక్ కూడా వైరల్ గా మారాయి. మొత్తానికి ఉస్తాద్ కూడా జెట్ స్పీడ్ లో కంప్లీట్ అవుతున్నాడు.

Also Read:ఉపాధి హామీ పథకంలో EKYC విధానం!

- Advertisement -