కరోనా ఎవ్వరిని వదలడం లేదు. కరోనా వల్ల చాలా కుటుంబాలు చిన్నాభిన్నం చెంది వారి కలలు కల్లలుగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ కరోనా బారినపడ్డారు. కరోనా సోకడంతో ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నానని బిల్ క్లింటన్ స్వయంగా ప్రకటించారు. ఇదే విషయంను ట్వీటర్ ద్వారా తెలిపారు.
నేను కరోనా పరీక్షలు చేయించుకున్నాను. అందులో పాజిటివ్ అని తెలింది. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. అయితే నేను బాగానే ఉన్నా ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాను. వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్ డోసు తీసుకోవడంతో తీవ్రత తక్కువగా ఉన్నది. అందువల్ల అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి అని క్లింటన్ ట్వీటర్ రాశారు.
76యేళ్ల క్లింటన్ 1993 నుంచి2001 వరకు రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇదే సమయంలో భారత్ రెండు సార్లు ఆణుపరీక్షలు నిర్వహించి విజయం సాధించింది. గత ఎన్నికల్లో 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా బిల్ క్లింటన్ భార్య అయిన హిల్లరీ క్లింటన్ పోటీ చేసి ఓడిపోయారు.
I’ve tested positive for Covid. I’ve had mild symptoms, but I’m doing fine overall and keeping myself busy at home.
I’m grateful to be vaccinated and boosted, which has kept my case mild, and I urge everyone to do the same, especially as we move into the winter months.— Bill Clinton (@BillClinton) November 30, 2022
ఇవి కూడా చదవండి….