26/11సూత్రధారి భారత్‌కు అప్పగించనున్న యూఎస్‌

37
- Advertisement -

2008 ముంబాయి ఉగ్రదాడుల్లో కీలక నిందితుల్లో ఒకడైన తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించాలని కాలిఫోర్నియా జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉన్న ఉగ్రవాదం కట్టడికి కీలకమైన అడుగులు పడ్డాయి. భారత్ అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా కోర్టు తీర్పునిచ్చింది. పాకిస్థాన్ మూలాలున్న తహవూర్‌ రాణా 2008లో ముంబాయి దాడులకు ఆర్థిక సాయం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేరారోపణలను గాను షికాగో కోర్టు ఇతనికి 14సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించింది.

Also Read: 20న సీఎంగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారం!

2008నవంబర్ 26న దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబాయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్ హెడ్లీకి తహవూర్ అత్యంత సన్నిహితుడు. ఇతను దాడికి ముందు రోజు ముంబాయిలో తుది రెక్కి నిర్వహించారు. అయితే జూన్‌22న ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఇలాంటి కీలకమైన తీర్పు వెలువడింది. అయితే ఈపర్యటనలో భాగంగా ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ జిల్ బైడెన్‌ స్టేట్ డిన్నర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

Also Read: Kiren Rijiju:న్యాయశాఖ బాధ్యతల నుండి తొలగింపు

- Advertisement -