అదనపు 25% సుంకాన్ని తొలగిస్తాం!

2
- Advertisement -

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత దిగుమతులపై విధించిన అదనపు 25 శాతం సుంకాన్ని కూడా తొలగించనున్నట్లు వైట్ హౌస్ ధృవీకరించింది. అయితే ఈ విషయంలో భారత్ రష్యా చమురు కొనుగోళ్లను కేవలం తగ్గించడమే కాకుండా పూర్తిగా నిలిపివేయాలని ఒప్పందంలో పేర్కొన్నట్లు వైట్ హౌస్ అధికారి స్పష్టం చేశారు.

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రకటన అనంతరం, భారత్‌పై సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో, సోమవారం (స్థానిక కాలమానం ప్రకారం) వైట్ హౌస్ అధికారి ఈ విషయం వెల్లడించారు. న్యూఢిల్లీ రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేస్తే, భారత దిగుమతులపై విధించిన అదనపు 25 శాతం సుంకాన్ని తొలగిస్తామని తెలిపారు.

భారత్ రష్యా చమురు కొనుగోళ్లు తగ్గిస్తే సుంకాలు తొలగిస్తారా? అన్న ప్రశ్నకు ఆ అధికారి స్పందిస్తూ..అవును. అయితే ఒప్పందం ప్రకారం భారత్ రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించడం కాదు, పూర్తిగా నిలిపివేయాలి అని చెప్పారు. ఈ వాణిజ్య ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ చెప్పారు. ప్రధాని మోదీతో జరిగిన ఫోన్ సంభాషణను ప్రస్తావిస్తూ, ఆయనను తన అత్యంత సన్నిహిత మిత్రుల్లో ఒకరుగా, భారతదేశానికి శక్తివంతమైన, గౌరవనీయ నాయకుడిగా కొనియాడారు.

మోదీ రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేందుకు, అలాగే అమెరికా నుంచి మరింత ఎక్కువగా కొనుగోలు చేయడానికి అంగీకరించారని ట్రంప్ తెలిపారు. అంతేకాకుండా, అమెరికాపై భారత్ విధిస్తున్న సుంకాలు, నాన్-టారిఫ్ అడ్డంకులను సున్నాకు తగ్గిస్తుందని కూడా చెప్పారు.

Also Read:ఐసీసీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం: బీసీసీఐ

- Advertisement -