మళ్ళీ హెచ్ 1-బీ వీసాల రద్దు !

223
us H1b visa
- Advertisement -

ఈ ఏడాది చివరి వరకు హెచ్‌ 1బీ వీసాలు సహా పలు వీసాలను రద్దు చేసింది అమెరికా. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. దీంతో అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే సుమారు 2 లక్షల 40 వేల మంది ఆశలపై నీళ్లు చల్లింది అమెరికా.

అయితే తాజాగా వెలువరించిన ఉత్తర్వులు ఇప్పటికే తమ దేశంలో పని చేస్తున్నవారికి ఈ ఆంక్షలు వర్తించబోవని ట్రంప్ స్పష్టం చేశారు. ఇలాంటి వీసాలు మంజూరై దేశం బయట పని చేస్తున్నవారు.. ఈ ఉత్తర్వుల కాలపరిమితి ముగిసేవరకు అమెరికాలో ప్రవేశించడానికి వీలు లేదు. కరోనా నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్.

కరోనాతో అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ప్రతిసంవత్సరం దాదాపు 85,000 వీసాలలో 70 శాతం వీసాలు భారతీయులకు ఇస్తోంది అమెరికా. హెచ్‌ 1 బీ వీసాల రద్దుతో గ్రీన్ కార్డులు ఆశీస్తున్న భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది.

- Advertisement -