కాజల్‌కి మోసగాళ్లు టీం స్పెషల్ విషెస్‌…

210
kajal
- Advertisement -

మంచు విష్ణు హీరోగా హాలీవుడ్-ఇండియన్ ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని చేధించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా వియా మార్ ఎంటర్టైన్మెంట్, ఎ.వి.ఎ. ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విరానికా మంచు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు.

కాజల్ అగర్వాల్, రుహాని సింగ్ హీరోయిన్లుగా నటిస్తుండగా బ్యూటీ కాజల్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపింది చిత్రయూనిట్. కాజల్‌- మంచు విష్ణుకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. అర్జున్‌గా విష్ణు- అనుగా కాజల్‌ అలరించనుంది.

షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు.

- Advertisement -