అమెరికాలో షట్‌డౌన్ ముగిసింది. షట్‌డౌన్ ముగించే బిల్లును అమెరికా కాంగ్రెస్ 222-209 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. అనంతరం బిల్లును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పంపింది అమెరికా కాంగ్రెస్.
అమెరికా షట్‌డౌన్ ముగింపు బిల్లుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. బిల్లుపై ట్రంప్ సంతకంతో అమెరికాలో 43 రోజుల షట్‌డౌన్ ముగిసింది. అయితే షట్‌డౌన్ ముగిసిన విమాన సేవలు, ఆహార సహాయం, ఫెడరల్ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి ఇంకా కొన్ని వారాలు పట్టవచ్చు.
అమెరికా చరిత్రలోనే అత్యంత దీర్ఘమైన ప్రభుత్వ షట్‌డౌన్ చివరకు ముగియనుంది. బుధవారం రాత్రి ప్రతినిధుల సభ (House of Representatives) ప్రభుత్వాన్ని తిరిగి ప్రారంభించడానికి రిపబ్లికన్ పార్టీ ప్రవేశపెట్టిన వ్యయ బిల్లును ఆమోదించింది. ఈ ఓటింగ్‌లో 222 మంది అనుకూలంగా, 209 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఆరుగురు డెమోక్రాట్లు కూడా బిల్లుకు మద్దతు ఇచ్చారు.
డెమోక్రాట్ల ప్రధాన డిమాండ్ అయిన ఆరోగ్య బీమా సబ్సిడీల పొడిగింపు ఈ బిల్లులో చేరలేదు. అయితే ఈ అంశంపై డిసెంబర్‌లో వేరు ఓటింగ్ నిర్వహించేందుకు రెండు పార్టీలూ అంగీకరించాయి. ట్రంప్ బిల్లుపై సంతకం చేసిన వెంటనే ఫెడరల్ ఉద్యోగులు తిరిగి పనిలో చేరతారు. ప్రీ-స్కూల్స్, ఆహార సహాయ కార్యక్రమాలు, ఫెడరల్ కార్యాలయాలు, జాతీయ పార్కులు, మ్యూజియంలు తిరిగి తెరవబడతాయి. ఉద్యోగులకు బ్యాక్ పే (వేతన బకాయిలు) ఎలా చెల్లిస్తారో, ఎప్పుడు హాజరుకావాలో సంబంధించిన సమాచారం త్వరలో అందుతుంది.
Also Read:స్పిరిట్ మూవీలో చిరు..క్లారిటీ!
షట్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఆర్థిక నివేదికలు త్వరలో విడుదల అవుతాయి. అయితే కొన్ని నివేదికలు కొద్దిగా ఆలస్యంగా రావచ్చు. వైట్ హౌస్ ప్రకటన ప్రకారం, “ఈ బిల్లు ప్రజలకు అవసరమైన సేవలలో వచ్చిన అంతరాయాలను ముగిస్తుంది మరియు వేతనం లేకుండా పనిచేసిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల వంటి ఉద్యోగులకు వెంటనే వేతనం చెల్లించబడుతుంది అని తెలిపారు.

