నిజామాబాద్‌లో కంపెనీ స్ధాపించేందుకు ముందుకొచ్చింది అమెరికాకు చెందిన క్రిటికల్ రివర్ సంస్థ. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు ఫౌండర్ అంజి మారం భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు రాబోయే రోజుల్లో నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా.
నిజామాబాద్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయని, అందుకు రాబోయే రోజుల్లో వారి సంస్థ అక్కడ ఒక బ్రాంచ్ పెట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా, హైదరాబాద్, విజయవాడలో కలిసి 1000 మంది ఉద్యోగులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. మంత్రి కేటీర్‌తో జరిగిన భేటీలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎన్నారై, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (TSTPC) విష్ణు వర్ధన్ రెడ్డి, క్రిటికల్ కేర్ ఫౌండర్ అంజి మారం పాల్గొన్నారు.
Also Read:శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు