బెస్ట్ యాక్టర్..తొలిసారి స్పందించిన బన్ని

30
- Advertisement -

జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన తర్వాత తొలిసారి స్పందించారు అల్లు అర్జున్. పుష్ప సినిమా నుంచి మేము చాలా విభాగాల్లో నామినేషన్లు వేశాం. కచ్చితంగా ఏదో ఒక విభాగంలో అవార్డు వస్తుందని నమ్మాము. అవార్డులు అనౌన్స్ చేసే టైంకి చిత్రయూనిట్ అంతా టీవీ ముందు కూర్చొని ఉన్నాం. ఉత్తమ నటుడు అవార్డు అనౌన్స్ చేయగానే సుకుమార్ ని గట్టిగా హత్తుకొని ఏడ్చేసాను అని చెప్పారు.

ఈ అవార్డు అతనికి వచ్చిన పురస్కారమే. సుకుమార్ చెప్పినట్టు నేను చేసాను అంతే. ఈ సారి నామినేషన్స్ లో 20 మంది నటులు పోటీలో ఉన్నారు బెస్ట్ యాక్టర్ కి. సౌత్ నుంచి కూడా కొంతమంది ఉన్నా బాలీవుడ్ నుంచే ఎక్కువగా ఉన్నారు. దేవిశ్రీకి కూడా అవార్డు వచ్చింది, ఇంకా వేరే విభాగాల్లో కూడా వస్తాయని అనుకున్నాం అని తెలిపారు.

తెలుగు నటుల్లో మొదటి అవార్డు నేనే సాధించాను అంటే ఆనందం కలిగినా ఎక్కువ షాక్ తిన్నాను అని చెప్పారు. నేనేదో గొప్ప నటుడని కాదు, నా కంటే గొప్ప నటులు ఉన్నారు. కానీ వారికి ఆ సమయంలో ఎందుకో కుదరలేదు అని చెప్పుకొచ్చారు బన్నీ.

Also Read:శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు

- Advertisement -