బీ-21… ఆరోతరం యుద్ధ విమానం

286
- Advertisement -

 భద్రతా పరంగా శుత్రుదుర్భేధ్యం కలిగిన దేశాల్లో అమెరికా మొదటి స్థానం. రెండవ ప్రపంచయుద్దం నాటి నుంచి అమెరికా రక్షణ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతూ ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలుస్తోంది. తాజాగా అమెరికా ఆరోతరానికి చెందిన బీ-21విమానాలను అమెరికా ఆవిష్కరించింది. ఇప్పటివరకు ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్‌ యుద్ధ విమానాలు అధునాతనమైనవిగా చెప్పవచ్చు. కాగా వాటిని అధిగమించి బీ-21 విమానాలు చేరిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ విమానాన్ని పట్టుకునే రాడార్‌ తయారుకాలేదంటే అతిశయోక్తి కాదు. అమెరికన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేర్చిన వెంటనే దీని స్పెసిఫికేషన్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కాలిఫోర్నియాలోని పామ్‌డేల్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో వీటిని యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఫ్లీట్‌లో చేర్చారు. బీ-21 రైడర్‌ చేరడంతో ఈ రకం యుద్ధ విమానం కలిగిన తొలి దేశంగా అమెరికా చరిత్ర సృష్టించింది. చైనా, జపాన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశౠలు కూడా ఈ రకం టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై పనిచేస్తున్నాయి.

బీ-21 రైడర్‌ పరిధి 9,600 కి.మీ కాగా, దాదాపు 10-టన్నుల పేలోడ్‌ను తీసుకెళ్లే సామర్ధ్యం దీని సొంతం. నార్త్రోప్ గ్రుమ్మన్ కంపెనీ నుంచి బీ-21 రైడర్ విమానాలు ఆరింటిని కొనుగోలు చేసింది. మరో 100 విమానాలను అమెరికా కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఇలాంటి విమానాలను అమెరికా కనీసం 200 కొనుగోలు చేయాలని నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

హెచ్‌ఐవీ వ్యాక్సిన్‌..తొలి ట్రయల్స్‌ సక్సెస్

ఈ తప్పు చేస్తే..మీ వాట్సాప్‌ బ్యాన్!

ఎక్కడికెళ్లినా భారతీయుడినే: సుందర్

- Advertisement -