ఉరాన్ అనుమానితుల స్కెచ్..

221
- Advertisement -

ముంబై సమీపంలోని అరేబియా తీరంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో ముంబై పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు ఆయుధాల‌తో సంచ‌రిస్తున్నార‌న్న నేప‌థ్యంలో హైఅలెర్ట్ ప్రక‌టించిన నేవీ అధికారులు.. అనుమానిత ఉగ్రవాది స్కెచ్‌ను విడుద‌ల చేశారు. ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉరాన్‌లో ఐదారుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో తిరుగుతూ కన్పించినట్లు స్కూలు విద్యార్థులు తెలిపడంతో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు.

అందులో భాగంగానే కొందరు స్కూలు పిల్లలు ఇచ్చిన సమాచారంతో అనుమానితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. ఈ చిత్రాలలో ఉన్నవాళ్లు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. ఉగ్ర కదలికల సమాచారంతో ఇప్పటికే నగరంలోని పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.

Terrorists

ఉరన్‌ ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉరన్‌కు సమీపంలోనే నెహ్రూ పోర్ట్‌, బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లు ఉన్నాయి. 2008లో 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా నగరంలోకి ప్రవేశించి ప్రముఖ స్థావరాలపై దాడులకు పాల్పడ్డారు. ముంబయిలో జరిగిన ఉగ్రదాడిలో 166మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లోని ఉరీలో ఉగ్రదాడి నేపథ్యంలో ముంబయిలో అనుమానితుల సంచారం కలకలం రేపింది.

- Advertisement -