ఎట్టకేలకు బోణి కొట్టిన ఆర్సీబీ..

18
- Advertisement -

మహిళల క్రికెట్ ప్రీమియర్‌ లీగ్‌లో ఎట్టకేలకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బోణి కొట్టింది. యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యూపీ విధించిన 136 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి చేధించింది ఆర్సీబీ. కిరణ్‌ అహూజా 30 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46, దేవిక 31 నాటౌట్‌, నైట్‌ 24 రాణించడంతో ఆర్సీబీ గెలుపు సునాయసమైంది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. గ్రేస్‌ హ్యారిస్‌ (32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), దీప్తీశర్మ (19 బంతుల్లో 4 ఫోర్లతో 22), కిరణ్‌ నవగిరె (22) మాత్రమే రాణించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది బెంగళూరు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -