స్వల్పంగా తగ్గిన పసిడి..

16
gold
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదారాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.53,050 గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.57,870గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.100 తగ్గి రూ.53,200గా ఉండగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.110 తగ్గి రూ.58, 020గా ఉంది.

బంగారం ధరలు తగ్గితే సిల్వర్ ధర మాత్రం పెరిగింది. కేజీ వెండిపై రూ. 500 పెరిగి హైదరాబాద్‌లో రూ.72, 500గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.500 పెరిగి రూ.69 వేలుగా ఉంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 1916.50 డాలర్లుగా స్పాట్ సిల్వర్ ఔన్సుకు 21.80 డాలర్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -