ఉప్పెన..రిలీజ్ డేట్ ఫిక్స్..!

405
uppena
- Advertisement -

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా, బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ‘ఉప్పెన’. త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఒక ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని తొలుత ఏప్రిల్ 2న విడుద‌ల చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా విడుదల తేది వాయిదా పడింది. అయితే ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో సినిమాను విడుదల చేయనున్నారని వార్తలు వచ్చాయి.

ఆ వార్తలన్నింటికి పుల్ స్టాప్ పెడుతూ క్రిస్మస్‌కి సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.

- Advertisement -