కేటీఆర్ @ ఖైదీ నంబర్‌ 3077

356
ktr
- Advertisement -

తెలంగాణ ఉద్యమ సమయం నాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు మంత్రి కేటీఆర్. వరంగల్ జైలులో తాను గడిపిన రోజులకు సంబంధించిన ఖైదీ గుర్తింపు కార్డును ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

2009 నవంబర్ 29 దీక్షా దివస్‌ రోజున కేసీఆర్, ప్రొ. జయశంకర్‌ అరెస్టయ్యారు. ఆ సందర్భంలో నన్ను అరెస్టు చేసి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు అని పేర్కొన్నారు కేటీఆర్. వరంగల్‌ సెంట్రల్‌ జైలులో కేటీఆర్‌కు 3077 నంబరును కేటాయించారు.

- Advertisement -