ప్రసాద్‌ పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలి: ఉప్పల శ్రీనివాస్

180
uppala srinivas
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో.. అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠమైన శ్రీ.జోగులాంబాదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల సముదాయంలో చేపడుతున్న “ప్రసాద్ పథకాన్ని” త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త .

ఈరోజు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు… ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా.. ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు కుటుంబ సమేతంగా శ్రీ.జోగులాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో సకుటుంబ సమేతంగా..దర్శనం చేసుకొని కుంకుమార్చన, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తదనంతరం ప్రసాద్ పథకం కింద చేపట్టిన రూ.36 కోట్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ ప్రసాద్ పథకం పనులు త్వరితగతిన జరుగుతున్నాయా..అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్నట్లు తెలిపారు. పనులు పూర్తయితే ఆలయాలకు భక్తుల రద్దీ పెరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రసాద్ పథకం పనులు దోహదపడ్డాయని మార్చిలో 163 ​​పిల్లర్లతో తొలిదశ పనులు ప్రారంభించినట్లు ప్రసాద్ పథకం అధికారులు చైర్మన్ కు తెలిపారు.

త్వరగా పనులు పూర్తి చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని అధికారులను చైర్మన్ గారు ఆదేశించారు. పనుల్లో ఏమైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురావాలని చైర్మన్‌ తెలిపారు. అలంపూర్‌లోని 17 గదుల హరిత టూ రిథమ్ హోటల్ భక్తులకు సరిపోవడం లేదని, రానున్న రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హరిత హోటల్‌లో అదనపు గదులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న కొన్ని గదుల ఫ్లోరింగ్ పాడైందని, వాటిని వెంటనే మరమ్మతులు చేయిస్తామన్నారు. హరిత హోటల్ వద్ద రెస్టారెంట్ మూతపడిన విషయాన్ని మేనేజర్ శ్రీనివాస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. రెస్టారెంట్ టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలో భక్తులకు అందుబాటులోకి తెస్తామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో.. మేనేజర్ శ్రీనివాస్ డీఈ ధనరాజ్ ఏఈ అనురాగ్,డీడీ ప్రాజెక్ట్ మేనేజర్ జయవర్ధన్, ఇంజినీర్ దాసరి రామకృష్ణ, విష్ణువర్దన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -