రైతు బాంధవుడు సీఎం కేసీఆర్: బాల్క సుమన్

117
balka suman
- Advertisement -

మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో రైతుబంధు సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సంబురాలకు ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హాజరై ట్రాక్టర్ నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే నేడు సువర్ణదినం అని, రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాలో చేరిన గొప్ప శుభదినం అన్నారు. రైతు బాంధవుడు, రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అందుకే రాష్ట్రంలో రైతన్న కళ్ళలో సంతోషం కనిపిస్తుందన్నారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడు లాంటి ముఖ్యమంత్రిపై పక్క రాష్టాల నేతలు, ముఖ్యమంత్రులు వచ్చి అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని, మీరు పాలిస్తున్న రాష్టాల్లో తెలంగాణ పథకాలు లాంటివి ఏమైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.

ఢిల్లీలో రైతులను చంపిన బీజేపీ నేతలు, నేడు తెలంగాణ ప్రజలు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రైతుల నుంచి, తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్‌ను విడదీయలేరన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలు రాష్ట్రంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఈ “రైతుబంధు” పథకం సంబురాల ముగింపు ఉత్సవాల్లో ట్రాక్టర్ ర్యాలీ ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ విఠల్ లో చెన్నూర్ నియోజకవర్గ రైతుబంధు అధ్యక్షులు మార్కెట్ చైర్మన్లు రైతుబంధు చైర్మన్లు సొసైటీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు సర్పంచ్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -