గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలునాటిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

217
uppala srinivas
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా గండి పెట్ రోడ్ లోని తారమతి భారదారి లో మొక్కలు నాటారు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా.

సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గా ఎన్నికైన మొదటి సారి నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు శ్రీనివాస్ గుప్తా. ఆనాడు అశోక చక్రవర్తి చెట్లు నాటితే ఈనాడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటించి దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ( టూరిజం సెక్రటరీ శ్రీనివాస్ రాజు , మనోహర్ రావు ఎం.డి టూరిజం , ఈ డి శంకర్ రెడ్డి ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -