బండి సంజయ్‌ది నోరా..?మోరా..?:దాస్యం

26
dasyam

సీఎం కేసీఆర్‌పై ఎంపీ,బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే,ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌. సీఎం కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలితే నాలుక చీరేస్తాం అని హెచ్చరించారు.

బండి సంజయ్‌ది నోరా..?మోరా అని ప్రశ్నించిన దాస్యం… తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తొండి సంజయ్ ఎక్కడున్నారని దుయ్యబట్టారు. పునర్విభజన చట్టంలో హామీలు ఏమయ్యాయని నిలదీశారు.

బీజేపీది మతతత్వ ఎజెండా అన్న దాస్యం…ఆయన చేసినవన్ని అసత్య ఆరోపణలే అన్నారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఎంటో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర పథకాలు, ప్రాజెక్టుకు కేంద్రం ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదని మండిపడ్డారు. వరంగల్ లో వరదలు వచ్చినప్పుడు వరద బాధితుల అన్ని రకాలుగా సహాయం చేశామని గుర్తు చేశారు.