క్రీడలకు మరింత ప్రోత్సాహం: ఉప్పల శ్రీనివాస్‌

216
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం క్రీడలను అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థులకు టి.ఆర్.ఎస్. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు.

ఈ పోటీల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. తర్వాత ఎమ్మెల్యే కిషోర్ గారు బ్యాటింగ్ చేయగా టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్త గారు బౌలింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారు, ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు విద్యా సాగర్ గారు, బిసి కమిషన్ మెంబర్ ఆంజనేయులు గౌడ్ గారు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ధర్మేంధర్ రెడ్డి గారు, కార్పొరేటర్లు హేమ గారు, శోభన్ రెడ్డి గారు, టిఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -