ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ -తెలంగాణ ఆధ్వర్యంలో ఎంపీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా..ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు మొక్కలు నాటే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పాల్గొని జమ్మి మొక్కలు నాటారు.1100 దేవాలయాల్లో 1100 జమ్మి చెట్టు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా.. ఆయన ఈరోజు హైదరాబాద్‌లో జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధి లోని బాలాజీ నగర్‌లో జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య,డిప్యూటీ మేయర్ కార్పొరేటర్స్ ఆధ్వర్యంలో.. వెంకటేశ్వర కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 2 రెండు జమ్మి చెట్టు మొక్కలు నాటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య,డిప్యూటీ మేయర్ ఆరె శ్రీనివాస్,నగర కార్పొరేటర్లు, వేంకటేశ్వర కాలని, 24 డివిజన్ కార్పొరేటర్ గొడుగు వేణు,25 డివిజన్ కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్, కార్పొరేటర్ కృష్ణ గౌడ్, ఐవిఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్,తెరాస పార్టీ నాయకులు మహిపాల్ రెడ్డి, మహేష్ నగర్ ఐవిఎఫ్ స్టేట్ ప్రచార కమిటీ చైర్మన్, మరియు మేడ్చల్ జిల్లా మాజీ ప్రెసిడెంట్ కాసం వెంకట హరి, ఐవిఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పెద్ది శ్రీనివాస్, ఐవిఎఫ్ మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ భువనగిరి శ్రీనివాస్, ఐవిఎఫ్ ట్రెసరర్ తాటి శ్రీనివాస్ గుప్త, వైస్ ప్రెసిడెంట్ శంభో పాండయ్య, కందుకూరి నాగేశ్వర్ రావు, తెలంగాణ రాష్ట్ర ఐవిఎఫ్ మహిళా విభాగం అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, ఐవిఎఫ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జులకంటి అశోక్ కుమార్ గుప్త, సికింద్రాబాద్ ఐవిఎఫ్ ప్రెసిడెంట్ కటకం శ్రీనివాస్, ఐవిఎఫ్ ఆధ్యాత్మిక మహిళ విభాగం ఛైర్మెన్ పొద్దటూరి శాంతి, ఐవిఎఫ్ రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు పబ్బ స్వప్న మరియు కప్రా ఐ.వి.ఎఫ్ మండల అధ్యక్షులు మొలుగు శ్రీలత, ఐవిఎఫ్ స్టేట్ ట్రెసరర్ గంగిశెట్టి సుజాత, మురళి పంతులు, ఐవిఎఫ్ లక్ష్మన ప్రసాద్ రావు, కందటి శ్రీనివాస్,గజ్జెల రమేష్,జయిని రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.