భవానీపూర్‌లో దీదీ ఘన విజయం..

22

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టారు.. లెక్కింపు ముగిసింది.. ఈ ఉపఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెలుపు జెండా ఎగురవేశారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై 58,832 గెలుపొందారు. సీఎం మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలవడంతో రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆమె సీఎం పదవిలో కొనసాగనున్నారు.