ఏడుపాయల జాతరలో గ్రీన్ ఛాలెంజ్

80
gic
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో బాగంగా.. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి దేవాలయం దగ్గర గల హరిత హోటల్ ఆవరణలో మూడు మొక్కలు నాటారు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం అని, ఇంత మంచి కార్యక్రమంలో ఈరోజు మెదక్ జిల్లాలోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మ వారి దేవాలయం సన్నిధిలో మొక్కలు నాటే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఒక మొక్క నాటి వాటిని సంరక్షించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో.. మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపు నూరి చంద్రపాల్, కాప్రా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జి. కృష్ణ మూర్తి, ప్రధాన కార్యదర్శి వరగంటి శ్రీనివాస్, కోశాధికారి రవ్వా ఈశ్వర్ రావు,వాసవి భవన్ చైర్మన్ ch. రామచంద్ర మూర్తి, IVF స్టేట్ ప్రచార కమిటీ చైర్మన్, & మేడ్చల్ జిల్లా మాజీ ప్రెసిడెంట్ కాసం వెంకట హరి, IVF స్టేట్ సెక్రటరీ పెద్ది శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, లక్ష్మణ ప్రసాద రావు, మెదక్ పట్టణ కౌన్సిలర్లు R. k శ్రీనివాస్,అవారి శేఖర్, పెద్ది శ్రీనివాసులు, నీలిమ జూపూడి, వాసవి, మరియు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -