గజ్వేల్‌లో మొక్కలు నాటిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా..

19
uppala

గజ్వేల్.. నియోజకవర్గ పరిధిలో దేవి శరన్నవరాత్రి (దసరా)ఉత్సవాల సందర్భంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త.

1). ఈరోజు సిద్దిపేట జిల్లా, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గల్ మండలంలోని విద్యా సరస్వతీ శనైశ్చరాలయములో దేవి శరన్నవరాత్రి (దసరా)ఉత్సవాల సందర్భంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.. తదనంతరం ఆలయ ఆవరణలో జమ్మి చెట్టు మొక్కను నాటడం జరిగింది. ఈ సందర్భంగా..మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు.

2). గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మరుకుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన దేవి శరన్నవరాత్రి (దసరా)ఉత్సవాల సందర్భంగా పాల్గొని,శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత పీఠం ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు..
తదనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా.. ఊరు ఊరికి ఒక జమ్మి చెట్టు గుడి గుడి కో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా దేవాలయం ఆవరణలో ఒక జమ్మి చెట్టు మొక్కను నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో.. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. గ్రామ ప్రజలకు దోమ మందు ప్యాకెట్స్ ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా..టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ..
పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశ్యంతో ప్రజలకు,బావి తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలని సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో.. తెలంగాణ కు హరితహారం కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో కోట్లాది మొక్కలు నాటుతూ..తెలంగాణ ను ఆకుపచ్చ తెలంగాణ గా మారుస్తూ.. కలియుగ అశోక చక్రవర్తి లాగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారని అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ గారి పిలుపు మేరకు..దేశ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత హరితహారం కార్యక్రమం చేపట్టి 24% ఉన్న గ్రీనరిని 33% పర్సెంట్ కు పెంచడం జరిగింది అన్నారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో… తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఆర్యవైశ్య జాతికి గౌరవం దక్కింది. ఆర్యవైశ్య కులానికి గతంలో ఏ ముఖ్యమంత్రి, పట్టించుకోలేదు, మాకు ప్రాధాన్యత ఇవ్వలేదు కేసీఆర్ గారుTRS ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఏ ప్రభుత్వం కూడా ఇంత ప్రాముఖ్యత ఇవ్వలేదు అన్నారు. 4 కార్పొరేషన్ చైర్మన్ పదవులు.. 11 మందికి మున్సిపల్ చైర్మన్ పదవులు, ఒకరికి ఎమ్మెల్సీ పదవి, ఒకరికి ఎమ్మెల్యే పదవి కూడా దక్కింది అని అన్నారు.ఆర్య వైశ్యులు సామాజిక సేవలో ముందుంటారు.ఏ పదవులు ఇచ్చినా నీతి నిజాయితీ తో కష్టపడి పని చేస్తారని అన్నారు. గతంలో బ్యాంకులు లేకుండె, అప్పుడు షావుకారులు ,షెట్ లే డబ్బులు అప్పుగా ఇచ్చేవారు. ఏ ఊరు లో చూసిన ఏ పల్లెటూరు లో అయినా కిరాణం షాప్ మొదలు పెద్ద ఇండస్ట్రీ వరకు ఊరికి అందం వైశ్యుడు.. అన్ని వర్గాల ప్రజలతో కలిసి మెలిసి ఉంటూ..అందరితోనూ సత్సంబంధాలు, సాన్నిహిత్యం కలిగి ఉండేది ఒక్క వైశ్యులకు మాత్రమే ఉంటుంది. సామాజిక సేవల్లో కూడా అది అన్నదానం, సత్రం కావచ్చు బడి, గుడి నిర్మాణంలో..కావచ్చు సామాజిక సేవలో ఏదైనా కావచ్చు వైశ్యులు ముందు ఉంటారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో..
మున్సిపల్ చైర్మన్ ఎన్.సి. రాజమౌళి గుప్త గారు,
గజ్వేల్ మున్సిపల్ కౌన్సిలర్స్.. ఉప్పల మెట్టయ్య గుప్త గారు,తలకొప్పుల దుర్గా ప్రసాద్ గారు, నాచారం లక్ష్మీ నరసింహ స్వామి ట్రస్ట్ మెంబెర్ నంగునూరి సత్యనారాయణ, నాచారం టెంపుల్ ధర్మకర్త లచ్చగౌని రాములు గౌడ్ IVF ప్రధాన కార్యదర్శి గోలి సంతోష్, NC సంతోష్ FFU గజ్వేల్ అధ్యక్షుడు, కోమరవెళ్లి ప్రవీణ్ కుమార్,తోట భిక్షపతి, విష్ణువర్ధన్ రెడ్డి, భిక్షపతి
పాములపర్తి గ్రామ సెక్రటరీ కె.స్వప్న ,పంతులు హరి, గజ్వేల్ IVF యూత్ ప్రెసిడెంట్ ఉత్తునూరి సంపత్, IVF పొలిటికల్ కమిటీ కో-చైర్మన్, వంగపల్లి అంజయ్య, నేతి సంతోష్, దొంతుల సత్యనారాయణ, గుడాల శేఖర్, శ్యాం సుందర్ గుప్త, మరియు చంద్రశేఖర్, చకిలం రమేష్,Trs నాయకులు గజ్వేల్ IVF ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నాయకులు..తదితరులు పాల్గొన్నారు.