తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు జడ్జిల నియామకం..

20
telangana high court

తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు జడ్జిలను నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు సెప్టెంబర్‌ 16 నాటి కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. జడ్జిలుగా శ్రీసుధ, సుమలత, రాధారాణి, మాధవీదేవి, తుకారామ్‌, లక్ష్మణ్‌, వెంకటేశ్వరరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.