టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు రావు-KTR తన పుట్టినరోజు సందర్భంగా.. పిలుపు నిచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా… ఈరోజు సొంత నిధులతో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబులెన్స్ ని అందజేశారు ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.
ఈరోజు మంత్రి శ్రీ_కేటీఆర్ చేతుల మీదుగా జెండా ఊపి అంబులెన్స్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా టూరిజం చైర్మన్ ని అభినందించారు మంత్రి కేటీఆర్. “గిప్ట్ ఏ స్మైల్” ఛాలెంజ్ లో భాగంగా అంబులెన్స్ ను అందించి గొప్ప మనసు చాటుకున్నారని కొనియాడారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ.25 లక్షల వ్యయంతో ఆధునిక టెక్నాలజీ కలిగిన ఒక నూతన అంబులెన్స్ ను అందించారు. ఈ అంబులెన్స్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా హైదరాబాద్ పట్టణంలోని ఆయా నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రులకు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను చేరవేయడం జరుగుతుంది. పేద ప్రజల సంక్షేమం కోసం,శ్రేయస్సు కోసం అంబులెన్స్ అందించారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. ఈరోజు సొంత నిధులతో అత్యవసర సేవల కోసం హైదరాబాద్, పట్టణ ప్రజలకు, వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి బహుమతిగా అంబులెన్స్ ని ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ అంబులెన్స్ ను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 3000 మంది పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు పుస్తె, మెట్టెలు, చీర, గాజులు, ఉచితంగా అందిస్తూ.. ఎంతో మంది పేదలకు రెక్కాడితే గాని డొక్కాడే నిరు పేదలకు ఆర్థిక సహాయం,చేయడం జరిగింది. బియ్యం నిత్యావసర వస్తువులు అందించారు. కరోన సమయంలో 2 లక్షల మందికి భోజనాలు, 14000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు కిట్స్, 6000 వేల మందికి కరోన సేఫ్టీ కిట్స్,అందించడం జరిగింది. అన్నారు. ఈరోజు శ్రీమతి & శ్రీ ఉప్పల విశ్వనాధం-అనంత లక్ష్మీ ల జ్ఞాపకార్థంగా ఉచిత అంబులెన్స్ ను అందించడం జరిగింది.అన్నారు. మనమందరం సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని అన్నారు.పేద ప్రజలకు సహయం అందించేందుకు తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఈ ఏడేండ్లలో ఎన్నో సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామని అన్నారు. సంక్షేమం లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది అన్నారు.వైద్య రంగానికి పెద్ద పీట వేశారు. జిల్లాకో ఆధునిక టెక్నాలజీ తో ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్మాణం, బస్తీ దవాఖానలు ఏర్పాటు, డయాలసిస్ సెంటర్లలో వైద్య సేవలు అందిస్తున్నారు. అన్ని హాస్పిటల్ లలో అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారని అన్నారు.నా వంతు సాయంగా ఈరోజు ఉచిత అంబులెన్స్ అందించడం జరిగింది అన్నారు.
ఈ కార్యక్రమంలో.. ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్ రెడ్డి Ghmc కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ఉప్పల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఉప్పల స్వప్న, ఉప్పల సాయి కిరణ్, ఉప్పల సాయి తేజ, మరియు IVF- ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు, IVF సికింద్రాబాద్ జోన్ నాయకులు, ఆర్యవైశ్య నాయకులు మరియు TRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.