- Advertisement -
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందని కూలీలు తెలంగాణలోనే ఉండిపోయారు. వారికి ఉప్పల ఫౌండేషన్ ద్వారా సహాయం అందించారు.
ఉప్పల ఫౌండేషన్ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ ఆదేశాలమేరకు ఆయన కుమారులు సాయి కిరణ్, సాయితేజలు ఈరోజు బోయిన్ పల్లిలో పోలీస్ డిపార్ట్ మెంట్ సహకారంతో బీహార్, యూపీ నుండి వచ్చి పనులు చేసుకుంటున్నవారికి, తెలంగాణకు చెందిన పలువురికి ఆహారం అందజేశారు చేసారు.
లాక్ డౌన్ కారణంగా ఆందోళన చెందవద్దని, మీ పోషణ బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో బోయిన్ పల్లి నార్త్ జోన్ సీఐ అంజయ్య పాల్గొన్నారు.
- Advertisement -