వలస కూలీలకు అండగా ఉప్పల ఫౌండేషన్..

232
uppala foundtions

లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ రాష్ట్ర నాయకులు, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఉప్పల ఫౌండేషన్ తరపున తట్టి అన్నారంలోని ఆదివాసీ కాలనీలో 250 వలస కూలీల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు.

uppala foundation

బీహార్, యూపీ, ఒరిస్సా నుండి వచ్చి ఇక్కడ లాక్ డౌన్‌లో ఉంటున్నవారికి బియ్యం, కందిపప్పు, సాల్ట్, కారం, పసుపును వారి నివాసాల వద్దకు వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ పరశురాం, దామోదర్, గోపాల్ గౌడ్ మరియు టీఆరెస్ నాయకులు పాల్గొన్నారు.

uppala foundation