UPI:యూపీఐ కొత్త రూల్స్ ఇవే

4
- Advertisement -

యూపీఐ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ఇకపై ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్ ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే వారికి బిగ్ అలర్ట్. చిరు వ్యాపారుల నుంచి వినియోగదారుల వరకు ఉపయోగపడేలా యూపీఐ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తీసుకొచ్చింది.

కొత్త రూల్స్ ప్రకారం.. ఒక్క ట్రాన్సాక్షన్ లో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు. ట్రావెల్ బుకింగ్స్, హోటల్ ఖర్చులు, ప్లైట్ టికెట్స్ వంటివి ఒక ట్రాన్సాక్షన్ లో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు. ప్రభుత్వం ఈ-మార్కెట్ ప్లేస్ లో 5లక్షల నుంచి 10లక్షల వరకు చెల్లించుకోవచ్చు.

క్రెడిట్ కార్డు బిల్స్ చెల్లించడంలో టెన్షన్ అవసరం లేదు. ఒకేసారి 5లక్షల నుంచి 6లక్షల వరకు క్రెడిట్ కార్డు బిల్లులు క్లియర్ చేయొచ్చు.ఆభరణాలు కోసం అయితే రెండు లక్షల నుంచి ఆరు లక్షల వరకు చెల్లించుకోవచ్చు.టర్మ్ డిపాజిట్ల కోసం డిజిటల్ అకౌంట్ ఓపెన్‌కు ఐదు లక్షల వరకు ఉంటుంది.డిజిటల్ అకౌంట్ ఓపెన్ – ఇనీషియల్ ఫండింగ్ రోజుకు రెండు లక్షల వరకు మాత్రమే ఉండనుంది.

Also Read:జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర

- Advertisement -