ఐటీఆర్ గడువు పొడిగింపు..ఫేక్ న్యూస్

7
- Advertisement -

నేటితో ఐటీ రిటర్న్స్‌ దాఖలు గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువు పెంచారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది ఐటీ శాఖ.

అవన్నీ ఫేక్‌ వార్తలని తేల్చి చెప్పింది. ఐటీ రిటర్నుల దాఖలుకు ఎలాంటి పొడిగింపు లేదని స్పష్టం చేసింది. ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువును ఇప్పటికే జులై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు పొడిగించినట్లు గుర్తు చేసింది. సోషల్‌ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దని సూచించింది.

ఆదాయపు పన్ను విభాగం అధికారికంగా ఇచ్చే అప్‌డేట్లను మాత్రమే అనుసరించాలని తెలిపింది. ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హెల్ప్‌డెస్క్‌ 24 గంటలు పనిచేస్తున్నదని, ముఖ్యంగా కాల్స్‌, లైవ్‌ చాట్స్‌, ఎక్స్‌ ద్వారా సమాధానాలు ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఐటీ విభాగం తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రకటన విడుదల చేసింది.

Also Read:జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ జైత్రయాత్ర

- Advertisement -