- Advertisement -
యూపీఐ చెల్లింపులు రూ.3వేలు దాటితే ఛార్జీలు అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు అని తెలిపింది. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మరాదు అని… రూ.3 వేలు దాటితే ఛార్జీలంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని తెలిపింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించింది.

Also Read:గరుడవాహనంపై ప్రసన్న వేంకటేశ్వరుడు
- Advertisement -

