కుల గణన..స్వాగతిస్తున్నాం

15
- Advertisement -

కుల గణన పై కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అన్నారుబీసీ కమిషన్  మాజీ  సభ్యులు ఉపేంద్ర.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి అసెంబ్లీలోనే జనగణనలో  కులగణన చేయాలని ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిన టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.

అదేవిధంగా చట్టసభలలో బీసీలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన టిఆర్ఎస్ ప్రభుత్వం.భారత ప్రభుత్వంలో బీసీ సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని నాటి ప్రధానమంత్రికి మన్మోహన్ సింగ్  కి స్వయంగా కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్,   ఆంధ్రప్రదేశ్ బీసీ నాయకులైన ఆర్ కృష్ణయ్య  బృందాన్ని ప్రధానమంత్రిని కలిసి వినతి పత్రం అందజేసినారు అన్నారు.

ఉద్యోగస్తులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కూడా అనేక సందర్భాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ఉత్తరాలు రాసింది. ఏది ఏమైనా 1931లో దేశంలో నాటి బ్రిటిష్ ప్రభుత్వం కులగనన చేసిందని ఆ తర్వాత స్వతంత్ర భారతంలో కాకాలేల్కర్ కమిషన్ మండల కమిషన్ రిపోర్ట్ లల్లో కులగనన చేయాలని చెప్పారని అయినా పాలకులు పెడచెవిన పెట్టారని అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాల హైకోర్టులు ఆయా రాష్ట్రాల కమిషన్లు జనగణనలో కులగనన చేయాలని దేశంలో మెజార్టీ ప్రజల లెక్కలు తెలవకుండా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధిలో గానీ సమ పంపకాలు జరగవని చెప్పినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన అన్నారు.

2011లో కాంగ్రెస్ పార్టీ సోషియో ఎకనామిక్ సర్వేతో కొంత చేసినప్పటికీ కొంత చేసినప్పటికీ లెక్కలు బయట పెట్టలేదని దేశంలో రాష్ట్రాలలో బీసీ సంఘాల నాయకులు పోరాటాలతో న్యాయబద్ధమైన ధర్మమైన డిమాండ్‌కు కేంద్రం ఇప్పటికైనా దిగివచ్చి జనగణనలో కులగనన చేస్తామని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని నిర్ణయం ద్వారా దేశంలోని మెజారిటీ ప్రజలకు తమకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కలిగిందని ఆయన అన్నారు .రాబోయే కాలంలో ప్రజలందరూ చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పొందటానికి ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read:కేసీఆర్ కిట్ వస్తుందా:సతీష్ రెడ్డి

- Advertisement -