- Advertisement -
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక మహేష్ తన తదుపరి చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం లాక్ డౌన్ తరువాత రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. అయితే ఈ మూవీలో విలన్ పాత్ర చాలా ప్రత్యేకంగా వుంటుందట. దాంతో ఈ మూవీలో విలన్గా సోనూ సూద్ – ఉపేంద్రల పేర్లను పరిశీలించారు.
ఈ ఇద్దరిలో ఉపేంద్ర అయితే ఈ పాత్రకి బాగుంటాడని చిత్ర బృందం కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. దీంతో డైరెక్టర్ పరశురామ్ ఈ విషయాన్ని మహేష్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన కూడా ఉపేంద్రని తీసుకోవడమే కరెక్ట్ అని అన్నాడట. దాంతో ఉపేంద్రతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఉపేంద్ర ఈ పాత్రతో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.
- Advertisement -