వాట్సాప్‌లో రానున్న సరికొత్త ఫీచర్లు..!

314
WhatsApp
- Advertisement -

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎన్నో సరికొత్త సదుపాయాలతో వినియోగదారులను ఇప్పటికే వాట్సాప్‌లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రతి అప్ డేట్ కు వాట్సాప్ ఏదో ఒక ఫీచర్‌ను అందిస్తూనే ఉంది. ఈసారి తాజాగా వాట్సాప్ పలు కొత్త ఫీచర్లను అందివ్వనుంది. వాటిలో డార్క్‌ మోడ్‌, లో డేటా మోడ్‌, మల్టిపుల్‌ డివైస్‌ సపోర్ట్‌ తదితర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

అసలు డార్క్ మోడ్ వల్ల ఉపయోగం ఏంటంటే.. మనం ఫోన్ ఉపయోగించేటప్పుడు సాధారణ మోడ్ లో ఉపయోగిస్తే దాని నుంచి వచ్చే ఆ కాంతి మన కళ్లపై ప్రభావం చూపిస్తుంది. ఫోన్ బ్యాటరీ కూడా తొందరగా అయిపోతుంది. అదే డార్క్ మోడ్ అందుబాటులో ఉంటే బ్యాక్ గ్రౌండ్ మొత్తం నల్ల రంగులోకి లేదా బూడిద రంగులోకి మారిపోతుంది. దీని కారణంగా మన కంటిపై ఆ కాంతి ప్రభావం తగ్గడంతో పాటు, ఫోన్ చార్జింగ్ కూడా ఎక్కువ సేపు వస్తుంది. అందుకే ఏ యాప్ కి అయినా డార్క్ మోడ్ అందుబాటులో ఉంటే దాన్ని ఉపయోగించడం మంచిది. వచ్చే ఏడాది నాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

WhatsApp dark mode

అలాగే లో డేటా మోడ్‌ ఫీచర్‌ను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో మొబైల్‌ డేటా వాడుతున్నప్పుడు డేటా సేవ్‌ అవుతుంది. అలాగే మల్టిపుల్‌ డివైస్‌ సపోర్ట్‌ ఫీచర్‌ ద్వారా ఒక వాట్సాప్‌ అకౌంట్‌ను ఎన్ని డివైస్‌లలో అయినా వాడుకోవచ్చు. ఇక క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా కాంటాక్ట్‌ల షేరింగ్‌, వాట్సాప్‌ స్టేటస్‌ హైడింగ్‌ తదితర ఫీచర్లను కూడా వాట్సాప్‌ త్వరలోనే అందివ్వనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్లను వాట్సాప్‌ టెస్ట్‌ చేస్తుండగా.. అతి త్వరలోనే కొత్త అప్‌డేట్‌ ద్వారా వాటిని వాట్సాప్‌ తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది.

- Advertisement -