జయజానకి భామతో ఉపాసన

202
Upasana praises Rakul
- Advertisement -

ఒకరిద్దరు తప్ప మీడియా ప్రతినిధులతో పెద్దగా రిలేషన్స్ లేకున్నా.. సోషల్ మీడియా పుణ్యమా అని ఉపాసన అడపాదడపా వార్తల్లో నిలుస్తునే వుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లైఫ్ లో జరిగే ఆసక్తికర అంశాలపై అప్ డేట్స్ ఇస్తూ ఉండే ఉపాసన.. తన కొత్త వర్కవుట్స్ గురించి సోషల్ మీడియాలో అప్డేట్స్ పెట్టింది.

‘మిమ్మల్ని మీరు మార్చుకోండి’ అంటూ 30 రోజుల ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను తీసుకుంది ఉపాసన. రోజూ ట్రైనర్‌ సూచనలతో కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికీ ఆమె దీన్ని ప్రారంభించి వారం రోజులైంది. ఏడోరోజున ఆమెతోపాటు కలిసి కసరత్తులు చేయడానికి కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తోడయ్యారు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇద్దరు కలిసి జిమ్‌లో సాధన చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేశారు.

జయ జానకి నాయక సినిమా విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడు నాకు.. రకుల్‌ప్రీత్‌ సింగ్‌కి ఉన్న క్షమశిక్షణ, అంకితభావం, ప్రేరణ కావాలి’ అని ట్వీట్‌ చేశారు. దీనికి రకుల్‌ ప్రతిస్పందిస్తూ.. ‘ధన్యవాదాలు ఉప్సీ! నువ్వూ చాలా గొప్పగా చేస్తున్నావు. ఓ సవాలును తీసుకుని దాన్ని పాటించడం అంత సులభమైన పని కాదు. అభినందనలు’ అని ట్వీట్‌ చేశారు. ‘నిజంగా సాధనను ఎంజాయ్‌ చేస్తున్నా’ అని ఉపాసన.. రకుల్‌కు బదులిచ్చింది.

- Advertisement -