మల్లన్న సన్నిధిలో ఉపాసన…

480
upasana
- Advertisement -

శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు హీరో రామ్ చరణ్ భార్య కొణిదెల ఉపాసన. ఈ సందర్భంగా ఆలయ అధికారులు,ఈవో కేఎస్ రామారావు ఘన స్వాగతం పలికారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ ఉభయ దేవాలయాలలో స్వామి, అమ్మవార్లకు ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు చేస్తున్న కృషిని అభినందించారు.

అనంతరం లాక్‌డౌన్‌ నేపథ్యంలో చెం చులకు తలెత్తిన కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో ఉండే వందలాది గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. హైదరాబాద్‌ అపోలో హెల్త్‌ ఫౌండేషన్‌, కంప్యూటరైజేషన్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ, సింథ్యాక్యామ్‌ లాబొరేటరీస్‌ల సహకారంతో చెంచులకు నిత్యావసర సరుకులు అందించినట్లు ఈ సందర్బంగా ఉపాసన వెల్లడించారు.

- Advertisement -