ఇటివలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినీ రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. #ChangeWithin పేరుతో ఢిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లో జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్ నటులు అమీర్‌ఖాన్, షారూక్ ఖాన్‌లతో పాటు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారన్న మోదీ కితాబిచ్చారు. ఈ సమావేశం పట్ల ప్రధాని మోదీ పై చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన మండిపడ్డారు.
బాలీవుడ్ ప్రముఖుల్ని ఆహ్వానించిన మోదీ….. దక్షిణాది తారలను ఎందుకు పిలవలేదన్నారు. దక్షిణాది అంటే మీకు ఎందుకంత వివక్ష అంటూ ప్రశ్నించారు. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ కూడా మోదీని ప్రశ్నించారు. కుష్బూ కూడా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ట్వీచ్ చేశారు. దేశానికి సౌత్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది. ఇక్కడి వాళ్లను కూడా కాస్త గుర్తు పెట్టుకొండి అంటూ ట్వీట్ చేసింది.
ఇక ఉపసన చేసిన ట్వీట్ పలవురు మద్దతు ఇవ్వగా మరికొందరు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.తెలుగు ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు, ఈనాడు సంస్ధల అధినేత కిరణ్, రకుల్ ప్రిత్ సింగ్ పలు హాజరయ్యారంటూ ట్వీట్ చేస్తున్నారు. కాగా ఉపసన ట్వీట్ కు ఓ బీజేపీ నేత కౌంటర్ ఇచ్చారు. మీ మామ చిరంజీవి, మీ ఆయన రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమాల్లో తెలుగు వాళ్లను ముఖ్యంగా హీరోయిన్స్‌గా ఎంత మంది తీసుకున్నారు అంటూ ప్రశ్నించాడు.
More than glad that people from south Indian cinema are finally speaking out against the second class treatment meted out to us. Hope we are heard loud and clear to @MIB_India @PrakashJavdekar ji and our H'ble PM @narendramodi Ji. #ChangeWithin
— KhushbuSundar (@khushsundar) October 23, 2019