లక్డీకఫూల్ మెట్రో వరకు షటిల్‌ సర్వీసులు..

417
Shuttle Service
- Advertisement -

బీఆర్కేఆర్ భవన్ నుంచి లక్డీకాఫూల్ మెట్రో స్టేషన్ వరకు రవాణా సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల కోసం బీఆర్కేఆర్ భవన్ నుంచి లక్డీకాఫూల్ మెట్రో స్టేషన్ వరకు నిరంతరం షటిల్స్. సర్వీసులు నడవనున్నాయి. ఇందుకోసం రెండు 12 సీటర్ బస్సులను అందుబాటులోకి తేనున్నారు అధికారులు.

బీఆర్కేఆర్ భవన్ నుండి లక్డీకఫూల్ వరకు షటిల్‌ సర్వీసులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇవాళ 5:15 ని. లకు బీఆర్కేఆర్ భవన్ నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఆసక్తి ఉన్న ఉద్యోగులు మెట్రో రైల్ సేవలు వినియోగించుకోవాలని సాధారణ పరిపాలనా శాఖ సర్క్యులర్ జారీ చేసింది.

- Advertisement -