ఉపాసనకు యూట్యూబ్ అవార్డు..

478
upasana
- Advertisement -

చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు తెలిసిన విషయాలను ట్వీట్టర్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అంతేకాకుండా రామ్ చరణ్, చిరంజీవికి సంబందించిన ఏ అప్‌డేట్ అయినా.. ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాభిమానులకు మెగా ఫ్యామిలీకి మధ్య వారధిలా నిలుస్తోంది. తాజాగా ఉపాసన ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ యూట్యూబ్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు అలాగే, పలువురు సెలబ్రెటీల హెల్త్ సిక్రెట్స్‌ గురించి ఇంటర్వూలు చేస్తుంది. ఇదిలా ఉండగా ఛానల్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే లక్ష సబ్ స్కైబర్లు ను రాబట్టింది. దీంతో యూట్యూబ్ సంస్ధ ఉపాసనను అభినందింస్తూ సిల్వర్ ప్లగ్ మొమెంటోను బహూకరించింది. ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంది ఉపసాన. ఇది చూసిన హీరోయిన్ సమంత ఉపసనకు అభినందనలు తెలిపింది.

upasana konidela got silver plug award by youtube company

- Advertisement -