సల్మాన్‌తో ఉపాసన..’బిపాజిటివ్‌’ ఇంటర్వ్యూ

493
salman upasana
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఫిట్‌నెస్,హెల్త్‌కు సంబంధించి బిపాజిటివ్ అనే మ్యాగజైన్‌ను రన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాగజైన్ ద్వారా పాఠకుల్లో స్పూర్తి నింపడానికి సెలబ్రిటీల ఇంటర్వ్యూ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌తో ఇంటర్వ్యూ చేశారు ఉపాసన.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన ఆమె..ఇంటర్వ్యూ సమయంలో సల్మాన్‌తో తీసిన వీడియోను పోస్టు చేసింది. ఇదీ భాయ్ అంటే..మీ రహస్యాలు మాతో పంచుకున్నందుకు థాంక్యూ..భాయ్‌లోని కొత్త కోణాన్ని చూపించబోతున్నాం అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు ఉపాసన.

సెలబ్రెటీల ఫిట్‌నెస్ రహస్యాలు, డైట్, హెల్త్‌కేర్ గురించి అడిగి తెలుసుకున్న విషయాలను మ్యాగజైన్‌తో పాటు బిపాజిటివ్ విత్ ఉపాసన అనే యూ ట్యూబ్ ఛానల్‌ ద్వారా అప్‌డేట్ చేస్తున్నారు. మెగాఫ్యామిలీతో సల్మాన్‌ ఖాన్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక రాంచరణ్ ముంబై వెళ్తే కచ్చితంగా సల్మాన్‌ను కలుస్తుంటారు. అలాగే, సల్మాన్ హైదరాబాద్‌కు షూటింగ్ నిమిత్తం వచ్చినా చరణ్ వెళ్లి కలిసిన సందర్భాలున్నాయి.

వరుస హిట్లతో దూసుకుపోతూ అభిమానులకు మంచి కిక్ ఇస్తున్నారు సల్మాన్‌. ప్రస్తుతం సల్మాన్ నటించిన ‘భారత్’ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

- Advertisement -