చెర్రీకి గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు..విడాకులపై స్పందించిన ఉపాసన

234
- Advertisement -

మెగాస్టార్‌ కోడలు, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ భార్యగానే చాలామందికి తెలిసిన ఉపాసన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అపోలో లైఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ‘బీ పాజిటివ్‌’ మేగజీన్‌ ఎడిటర్‌, చారిటీ వర్కర్‌ వంటి బాధ్యతలు కూడా ఉపాసన నిర్వర్తిస్తోంది. ఇన్ని హోదాలు ఉన్నప్పటికీ ఉపాసన మీడియాకు ఎప్పుడూ దూరమే. కొంతకాలంగా రాంచరణ్‌తో విడాకులు తీసుకుంటుందన్న వార్తలు పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలను రాంచరణ్ అప్పట్లోనే ఖండించాడు.

ఇక ఉపాసన ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఎప్పుడు విడాకుల గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చింది ఉపాసన. ‘మా ఆయనకు చాలామంది గాళ్‌ఫ్యాన్స్‌ ఉన్నారు. వాళ్లంతా చరణ్‌కు బాగా అందంగా ఉన్న అమ్మాయే భార్యగా రావాలని కోరుకున్నారేమో. అందుకే నన్నంతలా విమర్శించారు. అయినా నేను దాన్ని కాంప్లిమెంట్‌గానే తీసుకుంటాన’ని సమాధానం చెప్పింది.

online news portal

‘నిజానికి మేం గనక డైవర్స్‌ తీసుకోవాలనుకుంటే మేమే మీడియా ముందుకు వచ్చి చెబుతాం. మాకలాంటి ఆలోచనే లేదు. ఎందుకంటే మేమిద్దరం బెస్ట్‌ఫ్రెండ్స్‌. కాబట్టి డైవర్స్‌ రూమర్లను ఇకనైనా ఆపండి’ అంటూ సూటిగా సమాధానం ఇచ్చింది. రామ్ చరణ్ గురించి ఎలాంటి రూమర్ వచ్చినా పట్టించుకోను. నేను మా ఆయన్ను ప్రేమిస్తాను, తను నన్ను ప్రేమిస్తాడు అని ఉపాసన తెలిపారు.

చిరంజీవి చాలా మంచి వ్యక్తి. అత్తయ్యగారు నన్ను చాలా బాగా చూసుకుంటారు. చరణ్, తన కుటుంబం నాకు ఎంతో అండగా నిలిచారు. అందుకే వారికి కృతజ్ఞతల తగినంతగా చెప్పుకోవాలి. చరణ్ ఎప్పుడూ నా పక్కనే ఉంటూ తోడుగా ఉంటాడని తెలిపింది. తన అసిస్టెంట్, డ్రైవర్… అందరూ కూడా నా గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. తలుచుకుంటే నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు.

online news portal

ఇక, పెళ్లి అయి ఇన్నిరోజులు గడుస్తున్నా పిల్లల్ని కనకపోవడానికి కూడా సమాధానమిచ్చింది. ‘ప్లీజ్‌.. నేనిప్పుడే ఎంతో కష్టపడి బరువు తగ్గాను. ఇప్పుడు పిల్లలంటే మళ్లీ బరువు పెరిగిపోతాను. నేను ఎప్పుడైతే పిల్లల్ని కనాలనుకుంటానో అప్పుడే కంటాను. దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నా వెనకాల అపోలో మొత్తం ఉంది. అయినా పిల్లలు అనేది పర్సనల్‌ విషయం. ఇప్పుడే మేం సొంత ఇల్లు కట్టుకుంటున్నాం. ఆ తర్వాత ఆ ఇంట్లో చరణ్‌తో చాలా టైమ్‌ స్పెండ్‌ చేస్తా. ఆ తర్వాతే పిల్లలు’ అని చెప్పింది.

- Advertisement -