గురు గోవింద్ ఉత్సవాలు విజయవంతం కావాలి..

300
- Advertisement -

సిక్కుల గురువు గురు గోవింద్ సింగ్ జయంతి ఉత్సవాలకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆహ్వానం అందింది. ఈమేరకు ఇవాళ సీఎం అధికార నివాసంలో మహారాష్ట్ర ఎమ్మెల్యే సర్దార్ తారాసింగ్, గవర్నర్ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్ సింగ్, నాందేడ్ బోర్డులో రాష్ట్ర సభ్యుడు దల్జీత్ సింగ్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా జాగృతి యాత్రను నిర్వహిస్తామని పేర్కొన్నారు.

online news portal

అక్టోబర్ 31న జాగృతి యాత్ర హైదరాబాద్ చేరుకుంటుందన్నారు. అదే రోజు కులీ కుతుబ్ షా మైదానంలో జరిగే గురుగోవింద్ సింగ్ జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని సీఎంను ఆహ్వానించారు.దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. యాత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. గురుగోవింద్ జయంతి ఉత్సవాలు విజయవంతం కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

online news portal

తెలంగాణ రాష్ట్రంలో సర్వమత సమానత్వం, సౌబ్రాతృత్వం వర్దిల్లుతున్నాయని మహారాష్ట్ర ఎమ్మెల్యే సర్దార్ తారాసింగ్ అన్నారు. దేశంలో కేవలం 2 నగరాలకే సిక్కుమత వర్గానికి చెందిన మేయర్లు ఉన్నారని తెలిపారు. అందులో ఒకరు తెలంగాణలోని కరీంనగర్ నగర్‌ మేయర్ రవీందర్‌సింగ్ ఉన్నారని వివరించారు. సిక్కులందరి తరపున సీఎంకు ధన్యావాదాలు తెలిపారు.

online news portal

- Advertisement -