ఉపాధ్యాయుల బదిలీలకు కీలక నిర్ణయం..

98
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో నెం 317లో వేరే జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి సీఎం కేసీఆర్ అదేశాల మేరకు అవకాశం ఇవ్వనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ హైకోర్టు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో మంగళవారం తన కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా సమీక్షా నిర్వహించారు. ఇప్పటికే ప్రారంభమైన బదిలీలు పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. తాజాగా సమీక్షలో జీవో 317 కింద బదిలీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ సమన్యాయం అందాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. బదిలీలు పదోన్నతులు కోసం 59వేల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి…

అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ, టీడీపీలకు బి‌ఆర్‌ఎస్ సెగ!

నిరంతర ప్రయత్నంతోనే సక్సెస్

- Advertisement -