ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాఫియా డాన్ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. గత పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉండేవన్నారు. కానీ ఇప్పుడు ఏ నేరస్థుడు మాఫియా వ్యాపారవేత్తలను బెదిరించలేరని పేర్కొన్నారు.
Also read: చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ సొంతం..
లక్నో హర్దోయీలలో టెక్స్‌టైల్ పార్కుల స్థాపనకు సంబంధించిన ఓ కార్యాక్రమంలో యూపీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. 2017కు ముందు ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు దారుణంగా ఉండేవని..అల్లర్లతో రాష్ట్రం అపఖ్యాతి మూటగట్టుకుందని అన్నారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన సంఘటనలను ఉటంకిచ్చారు. 2017నుంచి ఇప్పటివరకు ఒక్క అల్లర్ల ఘటన చోటుచేసుకోలేదని తెలిపారు. ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధంచలేదని వివరించారు. పెట్టుబడులు పరిశ్రమల స్థాపనకు ఇది అనుకూల అవకాశాలను సృష్టిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఏ నేరస్థుడు మాఫియా వ్యాపారవేత్తలను బెదిరించలేరు. రాష్ట్రం నేడు మెరుగైన శాంతి భద్రతలకు భరోసా కల్పిస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
Also read: బీజేపీ వైసీపీ దోస్తీ.. నో నో !