గో సంరక్షణ సంఘాలు ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే దేశంలో ఆవులకు మంచి రోజులు వచ్చాయని. అది కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యల వల్ల. అవును..అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నకబేళాలపై యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపారు. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌లో అక్రమ కబేళాలపై తీసుకుంటున్న చర్యలను చూసి మిగతా రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి.
యోగి ఆదిత్యనాథ్ ను స్ఫూర్తిగా తీసుకుని జార్ఖండ్ ప్రభుత్వంకూడా అక్రమ కబేళాలపై నిషేధం విధించింది. అక్రమంగా గోవధ పాల్పడిన వారికి జీవితఖైదును విధిస్తూ గుజరాత్ ప్రభుత్వం తాజాగా గో సంరక్షణ చట్టానికి సవరణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే, బీహార్‌లో కూడా గోవధ నిషేధం అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని రోహతాస్ జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న కబేళాలను మూసి వేయాలని హైకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.
వీటిని మూసివేయడానికి సుమారు 40 రోజులు కోర్టు గడువు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఇప్పటికే వాటిని మూసివేశారు. అలాగే, కర్నాటకలో కూడా అక్రమంగా నిర్వహిస్తున్న 1800 గోవధ శాలలను కూడా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే తరహా నిర్ణయాలు తీసుకునే దిశలో రాజస్థాన్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలో ఆవులకు మంచి రోజులు..
- Advertisement -
- Advertisement -